
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన కుడిచేతిపై కనిపించిన తెల్లటి మచ్చ కారణంగా, ఆరోగ్య సమస్యలపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో కెమెరాలకు స్పష్టంగా ఈ గుర్తు కనిపించింది.
ఈ దృశ్యం బయటకు రాగానే ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతిపై ఉన్న మచ్చను మేకప్‌తో కప్పిపుచ్చినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. గతంలో కూడా ట్రంప్ చేతులపై గాయాలు, వాపులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో సమావేశంలోనూ, న్యూజెర్సీలో జరిగిన ఒక కార్యక్రమంలోనూ ఆయన చేతులు, కాళ్లపై వింత వాపులు ఫోటోలలో కనిపించాయి. దీంతో ఆయనకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉందా అన్న సందేహాలు మరింత బలపడ్డాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ట్రంప్ బృందం ఈ ఆరోగ్య ఊహాగానాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఈ తరహా ప్రచారం, రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. ఆయనకు నిజంగా సమస్య ఉందా లేక ఇది కేవలం ఊహాగానమేనా అన్నది స్పష్టత కావాలి.