
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిర్మాతలకు బడ్జెట్ సమస్యలు వచ్చినప్పుడు స్టార్ హీరోలు సహకరించాలి అంటూ ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.
నితిన్ తమ్ముడు మూవీకి రెమ్యునరేషన్ విషయమై సహకరించిన విధానం దిల్ రాజు అభినందించారు. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌ల నుంచి తనకు వచ్చిన మద్దతును గుర్తు చేశారు. హీరోలు ఒక్కసారి కూర్చొని ప్రాజెక్ట్ డిటైల్స్ వింటే సపోర్ట్ చేస్తారని తెలిపారు.
‘బృందావనం’ టైంలో ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’కు ప్రభాస్, ‘సీతమ్మ వాకిట్లో’ సినిమాకు మహేష్, ‘వకీల్ సాబ్’కు పవన్ కల్యాణ్ సహకరించారని దిల్ రాజు తెలిపారు. సినిమాలు తీసేటప్పుడు ఆర్ధిక పరిస్థితిని హీరోలతో షేర్ చేయాలన్నారు.
ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు ఓపిక లేకుండా ప్రాజెక్టులు వేగంగా అనౌన్స్ చేస్తున్నారని విమర్శించారు. హీరోలతో రియాలిటీపై చర్చ జరగాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
దిల్ రాజు వ్యాఖ్యలు నేటి టాలీవుడ్ పరిస్థితిపై స్పష్టత ఇస్తూ, నిర్మాతలు–హీరోల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.
dilraju, starheroes, budgetissue, ntr, maheshbabu,