
టాలీవుడ్లో కొత్త టాలెంట్‌కు అవకాశం కల్పించడంలో దిల్ రాజు మరో అడుగు ముందేసారు. ఆయన ప్రారంభించిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫాం, రచయితలు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నీషియన్లకు తలుపులు తెరుస్తోంది.
తమ కథలను, స్క్రిప్టులను నేరుగా పంపించే అవకాశం ఇందులో ఉంది. సెలెక్ట్ అయ్యే ఐడియాలకు పరిశీలన జరిపి, టాప్ ఫైనలిస్టులకు ఇండస్ట్రీలో ప్రముఖులతో ఫేస్ టు ఫేస్ చాన్స్ లభిస్తుంది.
ఇది ఓ వెబ్ పోర్టల్ మాత్రమే కాకుండా, క్రియేటివ్ టాలెంట్‌కు బ్రిడ్జ్‌గా మారుతోంది. ఇదే కాకుండా దిల్ రాజు ‘లొర్వెన్ AI’ స్టూడియోను ప్రారంభించి, ఏఐ సాయంతో సినిమా నిర్మాణంలో వేగం, సమర్థతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
టెక్నాలజీతో పాటు టాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తున్న దిల్ రాజు, తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ జూన్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇండస్ట్రీకి రావాలనుకునే వారికిదే సరిగ్గా గోల్డెన్ ఛాన్స్.
DilRajuDreams, NewTalentTollywood, DigitalFilmPlatform, AIinCinema, Telugu Film News,