
స్పోర్ట్స్ డెస్క్: DC vs RR: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌పై సూపర్ ఓవర్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తికర విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 188/5 స్కోర్ చేసింది. అభిషేక్ పోరెల్ (49), కేఎల్ రాహుల్ (38), స్టబ్స్ (34) రాణించగా, రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆదిలోనే జైశ్వాల్ (51), సంజు శాంసన్ (31) చెలరేగారు. మిడిల్ ఆర్డర్‌లో నితీశ్ రాణా (51) ఆకట్టుకున్నా, చివర్లో జురైల్ రనౌటయ్యడంతో మ్యాచ్ టై అయింది. 20 ఓవర్లలో రాజస్థాన్ 188/4 స్కోర్ చేసింది.
సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. హెట్‌మయర్, పరాగ్ ఫోర్లు బాదినప్పటికీ, రనౌట్లు నిర్ణాయకంగా మారాయి. దిల్లీ తరఫున స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు.
దిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 12 పరుగులు కాగా, కేఎల్ రాహుల్ 2 బంతుల్లో 6 పరుగులు, స్టబ్స్ ఒక సిక్స్‌తో 4 బంతుల్లోనే మ్యాచ్ ముగించాడు. బౌలింగ్‌లో సందీప్ శర్మ రాజస్థాన్‌కు విజయం అందించలేకపోయాడు.
ఈ థ్రిల్లింగ్ గేమ్‌తో దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో కీలక విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్‌లో స్టబ్స్ సిక్స్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.