fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsస్పిరిట్ కోసం ఆమె రూ.20 కోట్లు అడిగిందా?

స్పిరిట్ కోసం ఆమె రూ.20 కోట్లు అడిగిందా?

deepika-demand-20-crores-for-prabhas-spirit

‘యానిమల్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే మాస్ పోలీస్ డ్రామాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అత్యధిక అంచనాలతో ముందుకెళ్తుండగా, కథ, బడ్జెట్‌తో పాటు కాస్టింగ్ విషయంలోనూ భారీ చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ వంటి పేర్లు వినిపించగా.. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు తెగ హల్‌చల్ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోయిన్ కావాలని కోరుతున్న మేకర్స్ దీపికను సంప్రదించగా, ఆమె రూ.20 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టు టాక్.

ఈ డిమాండ్‌ను మేకర్స్ అంగీకరించినట్టు, త్వరలోనే దీపిక పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా దీపిక రికార్డు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటికే ప్రభాస్-దీపిక జోడీ ‘కల్కి 2898 AD’లో సందడి చేసింది. పార్ట్ 2లో కూడా ఈ జోడి కొనసాగనుంది. ఇక స్పిరిట్‌తో ఈ కాంబో మరింత హిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Prabhas, DeepikaPadukone, SpiritMovie, SandeepReddyVanga, PanIndia Film,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular