
అమెరికాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. వేసవి సెలవులతో ప్రజలు భారీగా ప్రయాణాలు చేయడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒహియో రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరిగాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తాజా నివేదిక ప్రకారం, ఎన్బీ.1.8.1, ఎక్స్‌ఎఫ్ జీ అనే కొత్త కరోనా వేరియంట్లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వేరియంట్లు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెపై ఒత్తిడి వంటి లక్షణాలను కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లు ధరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక దూరాన్ని అనుసరించాలి అని అధికారులు సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పాత రోజులు తిరిగొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. కరోనా వైరస్ మరోసారి సీరియస్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి.