
న్యూస్ డెస్క్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఉపశమనాన్ని అందించింది. రూ.344 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నిధుల్లో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, మిగతా రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. సెర్ప్ ద్వారా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ఈ నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే నిధులు మంజూరు చేసింది.
రుణాల పంపిణీ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు అందజేస్తారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది.
బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలపై క్లిష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో వేల కోట్ల బకాయిలు పెంచారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాన్ని మళ్లీ ప్రారంభించి మహిళలకు మద్దతు అందిస్తున్నది.
