
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ ను రెట్టింపు చేసింది.
ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా జోష్ మీదున్నట్టే కనిపిస్తోంది. సీడెడ్ రైట్స్ డీల్ గురించి వచ్చిన సమాచారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ చిత్రం సీడెడ్ హక్కులు రూ. 23 కోట్లకు పైగా అమ్ముడైయ్యాయని తెలుస్తోంది.
ఇది పవన్ సినిమాల స్టాండర్డ్‌కి తగ్గట్టు పెద్ద బిజినెస్. గత కొన్ని సంవత్సరాల్లో వచ్చిన ఇతర స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో ఇది కూడా ఒక ముఖ్యమైన డీల్ గా నిలుస్తుంది.
దీనిని బట్టి సినిమాపై ట్రేడ్‌లో ఉన్న నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది. పైగా ట్రైలర్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా డీల్‌కి ప్లస్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో ఆదరణ లభిస్తుందో చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
