
ఈ ఆగస్ట్ 14న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మామూలు తాకిడి కాదనిపిస్తోంది. ఒకవైపు రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, శ్రుతి హాసన్ నటిస్తున్న కూలీ, మరోవైపు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియరా అధ్వానీ కలిసి వస్తున్న వార్ 2.
ఇవి రెండూ ఒకే రోజు విడుదలకు రెడీ అయ్యాయి. వార్ 2 టీజర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ యాక్షన్, కియరా బికినీ లుక్, హృతిక్ స్టయిల్ మాస్‌కి కనెక్ట్ అయ్యాయి.
అటు కూలీలో లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్, సూపర్‌స్టార్ స్టామినా కలిసివస్తుండటంతో థియేటర్‌ల ముందు క్రేజ్ బాగుంది.
ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్‌లో వందల కోట్లు వసూలు చేసే సామర్థ్యం కలవే. అయితే ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ షేరింగ్ పెద్ద సవాలవుతుంది.
కూలీకు నార్త్‌లో, వార్ 2కి సౌత్‌లో స్క్రీన్‌లు లభించటం క్లిష్టమే. ప్రస్తుతం సినిమా లవర్స్ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫైనల్ గా పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా ఈ క్లాష్ లో నెగ్గే అవకాశం ఉంది.
Coolie, War2, PanIndiaClash, NTRvsRajinikanth, August14Release,