Saturday, March 14, 2026
HomeMovie Newsకూలీ మోనికా సాంగ్.. తెలుగు యూట్యూబ్‌లో నెం.1 ట్రెండ్

కూలీ మోనికా సాంగ్.. తెలుగు యూట్యూబ్‌లో నెం.1 ట్రెండ్

coolie-monica-song-trending-no1

రజినీకాంత్ నటిస్తున్న “కూలీ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.

ఈ పాటను మోనికా అనే పేరుతో ఇటీవల రిలీజ్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాట తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదలైంది. మూడు భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో పూజా హెగ్డే డాన్స్, స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమెతో పాటు సౌబిన్ సాహిర్ నటన కూడా పాటకు ఆకర్షణ జోడించింది. వీరి కాంబినేషన్ పాటకు మంచి వాల్యూ తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఈ పాట తెలుగులో యూట్యూబ్ నెంబర్ 1 ట్రెండ్‌గా కొనసాగుతోంది. విశేషంగా ఫ్యాన్స్ నుంచి స్పందన రావడంతో పాట వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా “కూలీ” సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇందులో రజినీతో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

coolie movie, monica song, pooja hegde special song, rajinikanth movie, anirudh music,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular