
బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారమే ఆసక్తికరంగా మారింది. నాగార్జున హోస్ట్‌గా ఉన్న ఈ షోలో శనివారం ఎపిసోడ్‌లో నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడారు. తనూజను ముందుగానే సేవ్ చేశారు. దీంతో మిగతా ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళ్తారు అన్నది సస్పెన్స్‌గా మారింది.
అయితే షూటింగ్ ముందే పూర్తయ్యింది. లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సీజన్ తొలి ఎలిమినేషన్‌గా శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. నామినేషన్‌లో డీమాన్ పవన్, శ్రష్టి వర్మకు తక్కువ ఓట్లు వచ్చాయని తెలిసింది. వీరిద్దరిలో చివరికి శ్రష్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
డ్యాన్సర్, కంపోజర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రష్టి.. హౌస్‌లో అయితే తన మార్క్ చూపించలేకపోయింది. ఉమెన్ పవర్ చూపిస్తానని చెప్పినా.. మొదటి వారం గొడవల్లో పెద్దగా పాల్గొనలేదు. అందుకే ఆమె ఎలిమినేషన్ సర్‌ప్రైజ్ అయినప్పటికీ లాజిక్‌గానే కనిపిస్తోంది.
సాధారణంగా బిగ్ బాస్‌లో డ్యాన్సర్లు ఉండటం వల్ల ఈవెంట్స్‌కి స్పెషల్ ఎంటర్టైన్‌మెంట్ అందుతుంది. కానీ ఈసారి రాము రాథోడ్ కూడా డ్యాన్సర్‌గా ఉన్నారు. దీంతో శ్రష్టి రోల్ తగ్గిపోయింది. టాస్కుల్లో కూడా తను కంటెంట్ ఇవ్వలేకపోవడం వల్లే బయటకు వెళ్లిపోయింది.
ఆడియన్స్ ఇప్పుడు ఎవరు పర్ఫార్మ్ చేస్తారో వారినే ఉంచాలని చూస్తున్నారు. కేవలం పేరు ఉన్నంత మాత్రాన కాపాడడం జరగడం లేదు. ఈ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లు మరింత యాక్టివ్‌గా మారే అవకాశం ఉంది.
