
బిగ్ బాస్ సీజన్ 9 చివరి కెప్టెన్సీ టాస్క్ 12వ వారంలో హోరాహోరీగా జరిగింది. ‘రోడ్ టు ద కెప్టెన్’ అనే ఈ టాస్క్‌లో ఫైనల్ రౌండ్‌లో కళ్యాణ్ పడాల డీమాన్ పవన్ పోటీ పడ్డారు.
ఈ టాస్క్‌లో రోడ్డుపై ఉన్న గుంతలను కంకర ఇసుకతో పూడ్చి ప్లేట్ పెట్టి స్టిక్కర్ అతికించాలి. కళ్యాణ్ డీమాన్ పవన్ ఇద్దరూ ఫిజికల్‌గా చాలా బలంగా ఉండటంతో టాస్క్ సరైన ఫైట్‌లా కనిపించింది.
టాస్క్ మొదలైనప్పుడు డీమాన్ పవన్ వేగంగా చేశాడు. కానీ మధ్యలో అతనికి తీవ్రమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. ఒక దశలో బ్యాక్ పెయిన్ ఎక్కువై పవన్ పడుకున్నాడు. అయినా వదలకుండా చివరి వరకు పోరాటాన్ని కొనసాగించాడు.
ఫైనల్‌గా కళ్యాణ్ పడాల టాస్క్ గెలిచి సీజన్ 9 చివరి కెప్టెన్ అయ్యాడు. ఆర్మీ నుంచి కామనర్ గా వచ్చిన కళ్యాణ్ తన నిజాయితీ ఆట తీరుతో అందరినీ అలరించాడు.
కెప్టెన్ గా గెలిచినా కూడా డీమాన్ పవన్ బ్యాక్ పెయిన్ చూసి కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. అటు మెడికల్ రూమ్ కి వెళ్లొచ్చిన డీమాన్ పవన్ కూడా గెలిచింది మనోడే కదా అని అనడం ఇంప్రెస్ చేసింది. ఈ ఇద్దరు ఆడిన తీరు చూసి వారు టాప్ 5కి అర్హులు అనిపించారు.
