
తెలుగులో మాస్ గాడ్‌గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం జైలర్ 2లో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జైలర్ తొలి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇందులో రజినీతో పాటు శివ రాజ్‌కుమార్ మరోసారి స్క్రీన్ షేర్ చేయనున్నారు.
ఇప్పుడు బాలయ్య కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట కేమియో రేంజ్లో ఉన్న పాత్రను బాలకృష్ణ అభ్యర్థన మేరకు 10 నిమిషాల మాస్ బ్లాక్‌గా మార్చినట్లు సమాచారం.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తమిళనాట కూడా బాలయ్య మాస్ పవర్ ఎలా ఉంటుందో చూపించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. బాలయ్య ఎంట్రీతో సినిమాకు హైపే మరింత పెరిగిపోయింది.
ఈ క్రాస్ ఇండస్ట్రీ కాంబినేషన్ ఎలా అలరిస్తుందో చూడాలి. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.