
మూవీడెస్క్: సూపర్‌హిట్ చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క ఘాటీ కొత్త చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యాక్షన్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌కు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.
విక్రమ్ ప్రభు ఇందులో దేశీ రాజు అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. UV క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో అనుష్క పవర్‌ఫుల్ రోల్‌తో కనబడనుండగా, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది.
ప్రస్తుతం సినిమా జూలై 11న విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించినా, ప్రమోషనల్ యాక్టివిటీస్ మాత్రం కనపడడంలేదు.
ఫస్ట్ సింగిల్ రిలీజైనప్పటికీ, బజ్ మాత్రం తక్కువగానే ఉంది.
ట్రైలర్ విడుదల తేదీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు కూడా తెలియకపోవడంతో సినిమా వాయిదా పడనుందని టాక్.
ఆగస్టులో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.
అనుష్కకు ఇది రెండేళ్ల తర్వాతి సినిమా కావడం విశేషం. మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తారేమో చూడాలి.