Wednesday, August 27, 2025
HomeMovie Newsఅల్లు అర్జున్ - అట్లీ కలయిక: గ్లోబల్ లెవెల్ సెట్!

అల్లు అర్జున్ – అట్లీ కలయిక: గ్లోబల్ లెవెల్ సెట్!

allu-arjun-atlee-global-project

న్యూస్ డెస్క్: పుష్ప 2తో దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో బజ్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే స్టార్ డైరెక్టర్ అట్లీతో చేసిన అనౌన్స్‌మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ కాంబినేషన్‌తో రూపొందుతున్న కొత్త సినిమా ఇప్పుడే గ్లోబల్ ఫినామినాగా మారే దిశగా దూసుకుపోతోందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ హాలీవుడ్ లెవెల్‌లో చర్చనీయాంశమైంది. అవతార్డ్యూన్జురాసిక్ వరల్డ్వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పని చేసిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండ్రా ఏవిస్కోనిటీ ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్, మార్కెట్ రీచ్ గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ఉండబోతుందని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.

అట్లీ ప్లానింగ్ విషయానికొస్తే ఎప్పటిలాగే గ్రాండ్ విజన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. దీనితో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి.

బన్నీ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఉన్న బన్నీ, ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్‌గా అవతరించవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular