fbpx
Monday, June 9, 2025
HomeTelanganaఅక్కినేని అఖిల్ - జైనాబ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి

అక్కినేని అఖిల్ – జైనాబ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి

akhil-zainab-grand-reception-hyderabad

అక్కినేని కుటుంబంలో పెళ్లి సంబరాలు కొనసాగుతున్నాయి. అఖిల్ – జైనాబ్ రిసెప్షన్ జూన్ 6న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై దంపతులను ఆశీర్వదించారు. మహేశ్‌బాబు-నమత్ర, రామ్ చరణ్-ఉపాసన, నాని, నిఖిల్ వంటి తారలు సందడి చేశారు.

దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. తమిళ హీరో సూర్య రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా, రాజకీయ, క్రీడా రంగం నుంచి ప్రముఖులు తరలివచ్చారు.

సొగసైన దంపతులు అఖిల్ – జైనాబ్ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా, అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

జూన్ 6న జరిగిన ఈ రిసెప్షన్‌కు ముందు నాగార్జున నివాసంలో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం జరిపారు. ఇది సాదాసీదాగా నిర్వహించినప్పటికీ రిసెప్షన్‌కి మాత్రం స్టార్ల తాకిడి చూశాం.

ఈ వేడుక అక్కినేని ఫ్యామిలీలోని మరో మధుర ఘట్టంగా నిలిచింది. అభిమానులు జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular