Wednesday, August 27, 2025
HomeMovie Newsఅఖిల్ ‘లెనిన్’లో ఐటమ్ సాంగ్ సర్ప్రైజ్.. స్టార్ హీరోయిన్ ఎవరు?

అఖిల్ ‘లెనిన్’లో ఐటమ్ సాంగ్ సర్ప్రైజ్.. స్టార్ హీరోయిన్ ఎవరు?

akhil-lenin-movie-item-song-star-heroine

అక్కినేని అఖిల్ కెరీర్‌లో కొత్త మలుపు తిప్పేలా భావిస్తున్న చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఓ కొత్త రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, ఆ పాటలో ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకురావాలని యూనిట్ ఆలోచిస్తోందని సమాచారం. ఈ ప్రత్యేక గీతాన్ని మంగ్లీ స్వరపరుస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ చిత్రం పూర్తిగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా ఆ యాసలోనే డిజైన్ చేసినట్లు సమాచారం. రాయలసీమ వైబ్‌తో అఖిల్ కొత్త అవతారం చూపబోతున్నాడు.

ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన కథానాయిక. అఖిల్ శ్రీలీల జోడీ లవ్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫిల్మ్ యూనిట్ చెబుతోంది. లవ్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మేకర్స్ ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ తేదీని ఇప్పటికే లాక్ చేసినట్టు టాక్. ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ వచ్చాక అంచనాలు మరింత పెరిగే అవకాశముంది.

గత సినిమాల ఫలితాల తర్వాత అఖిల్ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న లెనిన్తో తన స్థాయిని పెంచుకోవాలని అతడు భావిస్తున్నాడు. ఐటమ్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరనేది అధికారికంగా బయటకు వస్తే సినిమా బజ్ మరింత పెరగడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular