
తెలుగు ఇండస్ట్రీలో ఓ సమయంలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డే, వరుస ప్లాప్‌లతో వెనక్కి తగ్గింది. తాజాగా తమిళ సినిమాలపై దృష్టి పెడుతూ మళ్ళీ ఫామ్‌లోకి రానీ ప్రయత్నాల్లో ఉంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో భారీ దక్కినట్టు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ ల్ సరసన పూజా హెగ్డే నటించబోతున్న సినిమా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడట.
ఈ ప్రాజెక్ట్‌కు పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.
ఇక మరోవైపు, లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో పూజా గ్లామర్ షో చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.