
న్యూస్ డెస్క్: గుజరాత్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలో వంతెనపై ఐదు వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
వంతెన కూలడంతో ట్రక్కులు, ట్యాంకర్లు నేరుగా నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందిని సహాయక బృందాలు రక్షించాయి.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారిని వెలికితీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ వంతెనకు గతేడాది మాత్రమే మరమ్మతులు జరిగాయి. కొత్త వంతెన నిర్మాణానికి సీఎం మూడు నెలల క్రితం రూ.212 కోట్లు మంజూరు చేశారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది.
ముఖ్యమంత్రి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ నిపుణులను సంఘటనా స్థలానికి పంపారు. వంతెన నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.