
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ డ్రామా “వార్ 2” టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి చర్చల్లో నిలుస్తోంది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్టు ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఏర్పరిచింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలపై నెగిటివ్ కామెంట్స్ వెల్లువెత్తాయి.
స్పై వర్డ్ వినగానే పాన్ ఇండియా ప్రేక్షకులు ఊహించే ఇమేజ్‌కు ఈ టీజర్ తగ్గలేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
ఈ పరిణామం మేకర్స్‌ను ఆలోచనలో పడేసింది. ఇప్పటికే టీజర్లో లోపాలున్నాయా అనే దానిపై రివ్యూస్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అవసరమైతే రీఏడిట్ లేదా సెకండ్ టీజర్‌తో తిరిగి సెట్ చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ పాత్ర సినిమాలో హైలైట్ కానుందని మేకర్స్ చెప్తున్నా… టీజర్ మిస్ఫిట్ గా ఫీల్ కావడమే నెగటివ్ ట్రిగర్ అయ్యిందని భావిస్తున్నారు.
మొత్తానికి “వార్ 2” టీజర్ రీ యాక్షన్ నేపథ్యంలో వచ్చే ప్రమోషన్లు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయనున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్.