
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదాన్ని మాస్ యాక్షన్‌తో మిక్స్ చేయడంలో అనిల్ రావిపూడికి మంచి పేరు ఉంది. ఇప్పటివరకు అనిల్ చేసిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించినప్పటికీ, మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్‌తో కలిసి పనిచేయడం ఆయన కెరీర్‌లో కీలకమైన మైలురాయి కానుంది.
ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 90 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్‌తో అనిల్ రావిపూడి ముందుకెళ్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ సినిమాలు సాధారణంగా లాంగ్ షెడ్యూల్స్‌తో సాగుతుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం స్పీడ్‌గా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
చిరంజీవికి మాస్, కామెడీ మిక్స్ సినిమాలు ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. అనిల్ రావిపూడి కూడా తన స్టైల్‌లో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా హిట్ అయితే, అనిల్ రావిపూడి పాన్ ఇండియా హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కించుకునే అవకాశముంది.
సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడికి గేమ్ ఛేంజర్ అవుతుందా? చిరు ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.