
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే ‘హిట్ 3’ సెన్సేషనల్ సక్సెస్తో మరోసారి తన మార్క్ చూపించాడు. ఇప్పుడు అతను తన తదుపరి మూవీ ‘ది ప్యారడైజ్’పై ఫోకస్ పెడుతున్నాడు. ఈ మూవీని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.
తాజా టాక్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ సెలెక్ట్ అయ్యిందట. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నానితో జోడీ కట్టనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతే కాకుండా, ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా నటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఈ వార్తలపై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ‘ది ప్యారడైజ్’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని, నాని మరోసారి కొత్త లుక్లో అలరించబోతున్నాడని సమాచారం.
Nani, TheParadise, KayaduLohar, SrikanthOdela, TeluguCinema,