Friday, April 17, 2026
HomeNationalపుతిన్‌కు బాడీ డబుల్స్.. ఢిల్లీ పర్యటన వేళ మళ్లీ పుకార్లు!

పుతిన్‌కు బాడీ డబుల్స్.. ఢిల్లీ పర్యటన వేళ మళ్లీ పుకార్లు!

vladimir-putin-body-doubles-conspiracy-theory-india-visit-kremlin-denial

న్యూస్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకి చేరుకున్నారు. ఆయన డిసెంబర్ 5న జరిగే 23వ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఆయన పర్యటనకి వచ్చిన వేళ, పుతిన్‌పై కొన్ని రోజులుగా ఉన్న బాడీ డబుల్స్ ఊహాగానాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

ఈ ధ్రువీకరించని వాదనల ప్రకారం.. పుతిన్ తన భద్రతా ప్రయోజనాల కోసం లేదా అనారోగ్యాన్ని దాచడానికి ఒకేలా కనిపించే స్టాండ్-ఇన్‌ల (డూప్స్)పై ఆధారపడుతున్నారని సమాచారం.

ముఖ్యంగా 2022లో ఉక్రెయిన్ సైనిక నిఘా అధిపతి మేజర్ జనరల్ కైరి లో బుడనోవ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పుతిన్ తనని పోలి ఉండే ముగ్గురు బాడీ డబుల్స్‌ను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని నియమించారని తెలిపారు.

గతంలో పుతిన్ డూప్స్‌లో ఎత్తు, హావభావాలు, చెవుల్లో తేడాలు స్పష్టంగా కనిపించాయి అని బుడనోవ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన అలస్కా సమ్మిట్ తర్వాత కూడా ఈ ఊహగానాలు వినిపించాయి.

ఈ ప్రచారంలో నిజం లేదని రష్యన్ టెలివిజన్లో పుతిన్ స్వయంగా ఖండించారు. క్రెమ్లిన్ ప్రతినిధి కూడా పుతిన్ బాడీ డబుల్స్ గురించి జరిగే ప్రచారాన్ని తోసిపుచ్చారు.

ఇది కేవలం అసమర్థమైన సమాచార మోసాల వర్గానికి చెందినది. ఇది నవ్వుకోవడానికి తప్ప ఉపయోగమేమీ లేదని ఆయన కొట్టి పారేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular