
న్యూస్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను మరో 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని తాజాగా వెల్లడించారు. ఈ తగ్గింపుతో వాహన గృహ రంగానికి సానుకూల పరిణామాలుంటాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా మధ్య తరగతి ప్రజలకు ముందస్తు సంక్రాంతి వచ్చినట్టు అయింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుతున్న తరుణంలో వడ్డీ రేటును తగ్గించడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. వడ్డీ రేట్లను అదే పంథాలో కొనసాగితే, కొనుగోలు శక్తి క్షీణించే ప్రమాదం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ ఉన్నప్పుడు వడ్డీ రేట్లను నిరంతరం పెంచారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్‌లోనూ ఆర్బీఐ రెపో రేటును సమీక్షించి సుమారు 1 శాతం వరకు వడ్డీరేటును తగ్గించింది.
ఇప్పుడు మరో 0.25 బేసిస్ పాయింట్లు (పావలా) తగ్గించడం ద్వారా మధ్యతరగతి, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు దారులకు మరింత ఊతం దక్కనుంది. ఉదాహరణకు 30 లక్షల ఇంటి లోన్ తీసుకున్న వారికి సుమారు ₹600 వరకు నెలకు కలిసి రానుంది.
