Tuesday, July 14, 2026
HomeNationalహిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ.. కారణాల చిట్టా ఇదే!

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ.. కారణాల చిట్టా ఇదే!

maoist-hidma-encounter-controversy-police-custody-devji-rajireddy-safe

న్యూస్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హిడ్మాను పోలీసులు పట్టుకుని కాల్చేశారని ఆరోపించింది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట తాజాగా ఓ లేఖ మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఏపీలోని మారేడుమిల్లిలో నవంబరు 18న హిడ్మా ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఆ నెల 15న హిడ్మాను అరెస్టు చేశారని, మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి 18న ఎన్‌కౌంటర్‌ చేసినట్లు ప్రకటించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ వివరణ ప్రకారం.. అక్టోబరు 27న విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి ద్వారా వైద్యం కోసం హిడ్మా దండకారణ్యం నుంచి బయటకు వచ్చాడు. హిడ్మా వెళ్లిన తరువాత మరికొందరు విజయవాడ వెళ్లారని, ఈ సమాచారం తెలిసిన పోలీసులు నిరాయుధుడైన హిడ్మాను పట్టుకున్నారని మావోయిస్టు పార్టీ తెలిపింది.

ఎవరు కారణం:

గతనెల 9న పార్టీ నుంచి కోసాల్ అనే సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని, అతనికి హిడ్మా సమాచారం తెలుసనని వికల్ప్ ఆ లేఖలో పేర్కొన్నారు.

  • కోసాల్
  • విజయవాడకు చెందిన కలప వ్యాపారి
  • బిల్డర్-సివిల్ కాంట్రాక్టర్
  • అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్

వీరంతా హిడ్మా ఎన్‌కౌంటర్‌ కు కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

దేవ్ జీ, రాజ్ రెడ్డి క్లారిటీ:

ఈ లేఖలో మావోయిస్టు అగ్రనేతలు దేవుజీ, రాజిరెడ్డిపై క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ పార్టీలో సురక్షితంగా ఉన్నట్లు వికల్ప్ వెల్లడించారు. దీంతో వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు జరిగిన ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular