
పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. కానీ ఈ సినిమా విడుదల ఎప్పుడవుతుందన్న దానికీ స్పష్టత లేకపోవడం ఇప్పుడు నిరాశకు దారి తీస్తోంది.
దర్శకుడు క్రిష్ మొదట తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ను జ్యోతి కృష్ణ కొనసాగిస్తుండగా, పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో షూటింగ్ పూర్తికాగానే వాయిదాలు మొదలయ్యాయి.
ఇటీవల పవన్ తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశారని టాక్. ఇక ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేయడం ప్రారంభమైంది. ఈ చర్యలు చూస్తే సినిమా వాయిదా ఖాయమైపోయిందనే అభిప్రాయం నెలకొంది.
ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రేకెత్తించిన ఈ సినిమా, పలు పోస్టర్లతో హైప్ క్రియేట్ చేసినా.. విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం ఆ ఆసక్తిని తగ్గించేస్తోంది.
ప్రస్తుతం మేకర్స్ నుంచి కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా పరిస్థితిపై గందరగోళమే నెలకొంది.
pawan kalyan veeramallu updates, veeramallu postponed again, overseas ticket refund veeramallu, krish jyothi krishna direction, pawan political busy schedule,