fbpx
Monday, June 9, 2025
HomeUncategorizedవరుణ్ తేజ్ లైన్‌లో మరో మూవీ? 

వరుణ్ తేజ్ లైన్‌లో మరో మూవీ? 

varun-tej-radhakrishna-new-movie-plans

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్-కామెడీ చిత్రాన్ని చేస్తున్నారు. కొరియన్ కనకరాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఇదే సమయంలో వరుణ్ తన తదుపరి సినిమా కోసం కూడా సన్నాహాలు ప్రారంభించారని సమాచారం.

తాజాగా దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్‌కు ఓ క్లాసికల్ లవ్ స్టోరీ లైన్ వినిపించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, రాధాకృష్ణ కథ చెప్పే తీరు, మ్యూజిక్-విజువల్స్‌లో నైపుణ్యం కలిగి ఉన్న దర్శకుడిగా పేరున్నాడు.

గోపీచంద్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసినా, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌ను ప్రధానంగా లొకేషన్‌లో హాజరవ్వాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేసే కథతో రాధాకృష్ణ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.

వరుణ్ గతంలో ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ లాంటి ప్రేమకథల్లో ఆకట్టుకున్న నేపథ్యంతో, ఈ లవ్ స్టోరీలోనూ తనకు మరో బ్లాక్‌బస్టర్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికి మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు, త్వరలో ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular