
న్యూస్ డెస్క్: కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్ (SIT) దూకుడు పెంచింది. నెయ్యి సరఫరా చేసిన డెయిరీ డైరెక్టర్లను అరెస్టు చేసిన సిట్, ఇప్పుడు టీటీడీపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో టీటీడీలో తొలి అరెస్టు నమోదైంది.
నెయ్యి ప్రొక్యూర్మెంట్ విభాగంలో జనరల్ మేనేజరుగా (జీఎం) పనిచేసిన ఆర్ఎస్ఎస్వీ సుబ్రహ్మణ్యాన్ని సిట్ తాజాగా అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు ఆయన సహకరించారని ప్రధాన ఆరోపణ.
సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో పనిచేస్తున్నారు. అయితే, కల్తీనెయ్యి కేసులో అరెస్టు అయిన మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నతో ఆయనకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది.
2022 ఏప్రిల్ లో సుబ్రహ్మణ్యం జీఎంగా ఉన్న సమయంలో నిందితుడు చిన్నప్పన్న ఆయన నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. చిన్నప్పన్న నుంచి నాలుగైదు లక్షల రూపాయల వరకు సుబ్రహ్మణ్యం తీసుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
గురువారం అతడిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సుబ్రహ్మణ్యాన్ని డిసెంబరు 10 వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ అరెస్టుతో టీటీడీలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబరు 15లోగా సుప్రీంకోర్టుకు తుది చార్జిషీటు దాఖలు చేయ
