న్యూస్ డెస్క్: శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న తనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. క్యూ న్యూస్ కార్యాలయంపై ఆదివారం జరిగిన దాడి ఘటనను గవర్నర్, డీజీపీతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ చర్య వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుచరులే ఉన్నారంటూ ఆరోపించారు.
చైర్మన్‌ను కలిసి జరిగిన విధ్వంసం వివరించిన మల్లన్న, రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసు ఉన్నతాధికారులను కూడా కలవనున్నట్లు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదంటూ మండిపడ్డ మల్లన్న, ఆమె ఎథిక్స్ కమిటీ ఎదుట నిలిపేయాలని డిమాండ్ చేశారు.
దాడిపై విచారణ హామీ ఇచ్చిన చైర్మన్ స్పందనపై మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. బీసీ నినాదాన్ని రాజకీయ ప్రయోజనం కోసమే వాడుతున్నారని ఆరోపించారు.
ఇక పోలీసు శాఖ మల్లన్నకు చెందిన ఇద్దరు గన్‌మన్లను విచారించింది. వారు కాల్పులు జరిపిన విషయాన్ని విచారణలో తెలిపారు.
కేవలం మీడియా కార్యాలయం మీదే కాకుండా, మల్లన్న ప్రాణాలకు కూడా బహిరంగ ముప్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అయన అనుచరులు చెబుతున్నారు.