Friday, December 12, 2025
HomeAndhra Pradeshసుజనా చౌదరికి ఈసారి మంత్రి పదవి వచ్చేనా?

సుజనా చౌదరికి ఈసారి మంత్రి పదవి వచ్చేనా?

sujana-chowdary-chance-for-cabinet-minister-ap-chandrababu

న్యూస్ డెస్క్: సుజనా చౌదరి పేరు మరోసారి రాజకీయాల్లో చర్చకు వస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందా అనే ఆసక్తి పెరిగింది. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న సుజనా, బిజినెస్ రంగంలో బలమైన పట్టున్న నాయకుడు. టీడీపీతో ఆయనకు గాఢమైన అనుబంధం ఉంది.

ఇప్పుడు పెట్టుబడిదారులకు మరింత నమ్మకం కలిగించేందుకు, రాష్ట్రానికి బలమైన పారిశ్రామిక వేత్తను మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబులో ఉంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 2014లో చంద్రబాబు కోసం సుజనా కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇక బీజేపీకి రెండో మంత్రి పదవి అవసరం ఉండగా, ఆ అవకాశం సుజనాకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించిన తరుణంలో, సుజనా మంత్రిగా వస్తే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉందని నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణపై అంతర్గత చర్చలు మొదలయ్యాయి. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి, సుజనా లక్కు ఈసారి కలిసొచ్చే అవకాశాలు చాలా ఉంటాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular