
న్యూస్ డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి రాగానే ఆయనకు వారం రోజుల క్వారంటైన్ వేయనున్నారు. యాక్సియమ్-4 మిషన్‌లో ఆయన ఐఎస్ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మిషన్ పూర్తయింది. జూలై 14న శుభాంశుతో పాటు ముగ్గురు అంతరిక్షయాత్రికులు భూమికి చేరనున్నారు. జూలై 15న కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్ జరగనుంది.
వీరిని భూమి వాతావరణానికి మళ్లీ అనుగుణంగా మార్చేందుకు ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఇది సాధారణ ప్రక్రియగా అధికారులు చెప్పారు.
అంతరిక్షంలో ఉన్న సమయంలో శరీరంపై భారరహిత వాతావరణ ప్రభావం ఉంటుంది. దాంతో భూమిపై తిరిగి చక్కదిద్దుకోవడానికి ఈ వ్యవధి అవసరమవుతుంది.
ఈ సమయంలో ఇస్రో వైద్య బృందం శుభాంశును పర్యవేక్షించనుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై నిరంతరం పరిశీలన సాగుతుంది.
అంతరిక్ష ప్రయాణం శరీరంపై కలిగించిన ప్రభావాన్ని అధ్యయనం చేయడం కూడా వైద్య బృందం ముఖ్యమైన పనిగా చేపట్టనుంది.