భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ షట్లర్ కశ్యప్ పారుపల్లితో విడిపోతున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని సైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ, “జీవితం కొన్నిసార్లు వేర్వేరు దారులు తీసుకెళ్తుంది” అని పేర్కొన్నారు. ప్రశాంతత, ఎదుగుదల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
2018లో సైనా కశ్యప్ పెళ్లి చేసుకున్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ పరిచయం నుంచే వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తరువాత ప్రేమగా మారి వివాహ బంధంగా మారింది.
సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు సైనా వెల్లడించారు. తమ గోప్యతను గౌరవించాలని కోరారు. కశ్యప్ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.
ఇటీవల సైనా ఆటకు దూరంగా ఉండడం గమనార్హం. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్టు ప్రకటించిన ఆమె, 2023లో చివరిసారి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడారు.
కశ్యప్ మాత్రం రిటైరైన తరువాత కోచింగ్‌పై దృష్టి పెట్టారు. ఈ పరిణామం సైనా అభిమానులను కాస్త ఉద్విగ్నానికి గురిచేసింది.