Sunday, July 26, 2026
HomeSportsRCBలో కీలక మార్పు: బెతెల్ స్థానంలో మరో హిట్లర్

RCBలో కీలక మార్పు: బెతెల్ స్థానంలో మరో హిట్లర్

rcb-replaces-bethell-with-seifert-ipl-playoffs

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలక సమయంలో ఆటగాడు జాకబ్ బెతెల్ దూరమవుతుండటం షాకిచ్చింది. 

ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉండటంతో బెతెల్ మే 23న ఆటనున్న మ్యాచ్‌ అనంతరం స్వదేశానికి వెళ్తున్నాడు.

ఆర్సీబీ యాజమాన్యం వెంటనే ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌ను తీసుకుంది. రూ.2 కోట్లకి ఒప్పందం చేసుకున్న సీఫెర్ట్ మే 24 నుంచి జట్టుతో చేరనున్నాడు. అతను 66 టీ20ల్లో 1,540 పరుగులు చేసిన అనుభవం కలిగిన ఆటగాడు.

2022లో కొద్దిపాటి ఐపీఎల్ అనుభవం ఉన్న సీఫెర్ట్, ఇటీవల పాక్‌తో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లో మెరిశాడు. మే 27న లక్నోతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

ఈ మార్పుతో ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్లేఆఫ్స్‌లో సీఫెర్ట్ తన శైలిని చూపిస్తే ఆర్సీబీకి ఊహించని బలంగా మారవచ్చు. ఇంగ్లండ్ ఆటగాళ్ల దేశవాళీ కర్తవ్యాల కారణంగా గుజరాత్ టైటాన్స్‌ జోస్ బట్లర్‌ను కూడా కోల్పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular