Thursday, February 12, 2026
HomeBig StoryRCB vs PBKS: క్వాలిఫయర్‌లో బెంగుళూరు ఘనవిజయం.. పంజాబ్ కు బిగ్ స్ట్రోక్!

RCB vs PBKS: క్వాలిఫయర్‌లో బెంగుళూరు ఘనవిజయం.. పంజాబ్ కు బిగ్ స్ట్రోక్!

rcb-beat-punjab-to-enter-ipl2025-final

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మెగా ఫినల్‌కు దూసుకెళ్లింది. మొట్టమొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ పోరులో అడుగుపెట్టింది.

చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. మార్కస్ స్టాయినిస్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. RCB బౌలర్లలో సుయాశ్ శర్మ (3/14), జోష్ హేజిల్‌వుడ్ (3/17), యశ్ దయాళ్ (2/11) అద్భుతంగా రాణించారు.

చిన్న లక్ష్యాన్ని RCB 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ సునాయాసంగా ఆడుతూ 27 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి రజత్ పటిదార్ (15*) తోడయ్యాడు.

విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19 పరుగులతో పెవిలియన్‌కు చేరారు. అయినా ఫస్ట్ హాఫ్‌లోనే ఫినిషింగ్ చూపించిన సాల్ట్ మెరుగైన ఫినిషింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ విజయంతో RCB ఐపీఎల్ 2025 టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular