
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ పరంగా ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉంది. వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త దిశగా అడుగుపెడుతోంది.
తాజాగా రష్మిక తన వ్యాపారయోజనంపై హింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో “ఇది నా హృదయానికి దగ్గరగా ఉంది, త్వరలో మీతో పంచుకుంటాను” అని చెప్పింది. ఆమె భావోద్వేగాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించాయి.
తర్వాత తల్లితో చేసిన ఫోన్ సంభాషణ వీడియోను షేర్ చేసింది. అందులో తల్లి బెస్ట్ విషెస్ చెబుతుండగా, రష్మిక తన వ్యాపార ప్రయాణం మొదలుకాబోతుందని తెలిపింది. కానీ ఏ బిజినెస్ ప్రారంభించనుందో మాత్రం వెల్లడించలేదు.
ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ తమ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రష్మిక కూడా ఆ మార్గంలోనే ఉన్నదని టాక్.
ఫ్యాన్స్ మాత్రం ఆమె బిజినెస్‌లో కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. త్వరలో ఆమె పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.