Sunday, August 16, 2026
HomeTop Storiesమరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీ.. మామూలు స్పీడ్ కాదుగా..!

మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీ.. మామూలు స్పీడ్ కాదుగా..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ సినిమాతో ఫ్యాన్స్‌ను కలవడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రజినీ మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశాడట. ఇది ఆయన కెరీర్‌లో స్పీడ్ ఇంకా తగ్గలేదని చూపిస్తోంది. ఏ ప్రాజెక్ట్‌నే అయినా ఎనర్జీతో చేయడం ఆయన ప్రత్యేకతగా మారింది.

డైరెక్టర్ యాక్టర్ శశికుమార్ ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఈ విజయంతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను స్వయంగా డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో రజినీకాంత్ కోసం ఓ కొత్త కథ రాసి కొంతమేర వినిపించాడట. తలైవా ఆ కాన్సెప్ట్ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇది రజినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది.

శశికుమార్ ప్రస్తుతం కథను పూర్తిగా సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత సినిమా పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే, రజినీకాంత్ ఇప్పటికే ‘జైలర్ 2’ ప్రాజెక్ట్‌ను నెల్సన్ డైరెక్షన్‌లో చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో వరుసగా రెండు సినిమాలతో తలైవా మరింత బిజీ అవనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular