Monday, August 10, 2026
HomeMovie Newsవివాదంలో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ

వివాదంలో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ

raja-saab-lands-in-legal-trouble-over-production-dispute

న్యూస్ డెస్క్: పలు వాయిదాలు, ఆలస్యాల మధ్య ముందుకు సాగుతున్న “ది రాజాసాబ్” ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా ఉన్న ఐవి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది.

తమతో చేసుకున్న ఒప్పంద నిబంధనలను పాటించలేదని, పెట్టుబడిగా ఇచ్చిన రూ.218 కోట్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

ఐవి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సమయానికి సినిమా పూర్తి చేయకపోవడం, సరైన అప్డేట్‌లు ఇవ్వకపోవడం, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై విశ్వప్రసాద్ ఇంకా స్పందించకపోయినా, లీగల్ పరిజ్ఞానం ఉన్న ఆయన సమాధానం ఆసక్తిగా మారింది.

డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పటికే ఉన్న పరిస్థితిలో, ఈ లీగల్ వివాదం ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరింత సందేహాలు రేపుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయితే బాగుంటుందని తెలుగు బయ్యర్లు కోరుతున్నారని విశ్వప్రసాద్ ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ అభిమానులు ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌లోనే రావాల్సిన సినిమా షూటింగ్, పాటల చిత్రీకరణ వాయిదాల వల్ల ఆలస్యమైంది. దర్శకుడు మారుతీ మధ్య మధ్యలో మాత్రమే అప్డేట్‌లు ఇచ్చారు.

దీనికన్నా ఆలస్యంగా మొదలైన “ఫౌజీ” వేగంగా పూర్తవ్వడం, రాజా సాబ్ ఇంకా క్లారిటీ లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఐవి ఆరోపణలకు పీపుల్స్ మీడియా ఎలా స్పందిస్తుందో, వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular