
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈశ్వర్‌తో కెరీర్ మొదలుపెట్టి బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఆడియన్స్ హార్ట్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం రాజా సాబ్ (డైరెక్టర్ మారుతి) మరియు హను రాఘవపూడితో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి సీక్వెల్, సందీప్ వంగా స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు భారీ మొత్తానికి బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒక్క యాడ్ కూడా చేయడం లేదు. కొంతమంది ప్రముఖ బ్రాండ్లు కోట్ల రూపాయల ఆఫర్లతో వచ్చినా ఆయన నో చెప్పినట్లు టాక్.
కారణం ఒకటే – సినిమా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలన్న పట్టుదల. యాడ్స్‌లో టైమ్ వేస్ట్ చేయడం కన్నా, సినిమాలే తన ప్రాధాన్యమని డార్లింగ్ భావిస్తున్నారట. ఇది ఆయన ప్రత్యేకతగా ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
వస్తున్న హై బడ్జెట్ ఆఫర్లను తిరస్కరించి, పూర్తిగా సినిమాల్లోనే మునిగిపోయే తత్వం ప్రభాస్‌ను మరింత స్పెషల్ స్టార్‌గా నిలబెట్టింది. అందుకే, డార్లింగ్ ఈ జెనరేషన్‌కి ట్రెండ్ సెట్టర్!