
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్–త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కి ఒక ప్రత్యేక ఎమోషన్. జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్బస్టర్లతో పాటు, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాల టోన్‌లోనూ త్రివిక్రమ్ స్టైల్ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మళ్లీ ఈ జోడి సీక్రెట్ గా పనిచేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల హరిహర వీరమల్లూ మూవీ పూర్తయింది. ఫైనల్ కట్‌కి త్రివిక్రమ్ కూడా ఓకే చెబుతున్నారంటూ ఫిల్మ్ నగర్ లో చర్చ నడుస్తోంది. మరోవైపు పవన్ నటిస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు కూడా త్రివిక్రమ్ తరచూ వెళ్తూ, సూచనలు ఇస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాల పనుల్లోనూ బిజీగా ఉన్నాడు.
నెక్స్ట్ బన్నీతో ప్రాజెక్ట్ అనే ప్రచారం మధ్యలోనే ఆగింది. ఇక వెంకటేష్‌తో కూడా సినిమా చేసే చాన్స్ ఉందంటూ టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ తన ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి పవన్ సినిమాలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంలో ఆసక్తికరంగా ఉంది. “పవన్ ఎక్కడుంటే త్రివిక్రమ్ అక్కడే” అన్న టాక్ బలంగా మారుతోంది.