Wednesday, June 24, 2026
HomeAndhra Pradeshఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం: చంద్రబాబు

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం: చంద్రబాబు

operation-sindhoor-chandrababu-message-nation-pride

ఏపీ: ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై కఠిన వ్యాఖ్యలు చేశారు సీఎం.

“పహల్గామ్ ఘటనలో మహిళల నుదుటి తిలకం తుడిచిన ఉగ్రవాదులకు తగిన శిక్ష ఇవ్వాలనే సంకల్పంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టాం,” అన్నారు చంద్రబాబు. భారత సైనికులకు సెల్యూట్ చేస్తూ, వారి త్యాగాల వల్లే దేశం క్షేమంగా ఉందన్నారు. మన దేశ గౌరవాన్ని సైనిక బలగాలే నిలబెట్టాయన్నారు.

పింగళి వెంకయ్య వంటి జాతీయ జెండా రూపకర్త ఈ ప్రాంతానికి చెందడంపై గర్వంగా ఉందని తెలిపారు. జాతీయ జెండా మనందరిలో దేశభక్తిని రెట్టింపు చేస్తుందని చెప్పారు. దేశం ఎదగాలంటే భద్రత కీలకం అని చెప్పారు.

ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. శత్రుదేశాలు భారత్‌ను అంచనా వేయకుండా చూసేలా మన సైన్యం నిలబడ్డదన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ శక్తిని మరోసారి ప్రపంచం తెలుసుకుందన్నారు.

Chandrababu, Operation Sindhoor, Pawan Kalyan, Terrorism, Tiranga Rally,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular