Friday, July 4, 2025
HomeMovie Newsఓజీ రాకపై క్లారిటీ.. రూమర్స్‌కి మేకర్స్ కౌంటర్!

ఓజీ రాకపై క్లారిటీ.. రూమర్స్‌కి మేకర్స్ కౌంటర్!

og-september-25-release-confirmed-by-makers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ రిలీజ్ విషయంలో అధికారిక క్లారిటీ వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి. అయితే, ఇటీవల ఓజీ సెప్టెంబర్ 25న రాక కష్టమేనంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ స్పందిస్తూ.. ‘‘రూమర్స్ నమ్మకండి, ఓజీ చెప్పిన డేట్‌కే వస్తాడు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని అభిమానుల్లో నమ్మకం పెరిగింది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా తెరకెక్కుతున్న ఓజీ, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలపై ఇప్పుడు ఇక ఎలాంటి సందేహాలే లేవని చెప్పొచ్చు.

og movie, pawan kalyan, sujeeth director, priya mohann, og release date fix

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular