Wednesday, July 16, 2025
HomeMovie Newsఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

ntr-trivikram-movie-update-by-nagavamsi

తమిళ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌పై తాజాగా నిర్మాత నాగవంశీ కీలక విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా మొదలు పెట్టబోతున్నారని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుందని, 2026 మొదటి భాగంలో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ఎన్టీఆర్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో ఉండేలా భారీ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని వివరించారు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రత్యేకంగా ఓ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ప్లాన్ చేశామని చెప్పారు. కానీ రామాయణ గ్లింప్స్ చూసిన తర్వాత దానికంటే మంచి ప్రెజెంటేషన్ కావాలనే ఉద్దేశంతో టైమ్ తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ కాంబినేషన్ గతంలో ‘అరవింద సమేత’ లాంటి విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

మెగా ప్లానింగ్‌తో సినిమా ఏర్పాట్లు సాగుతున్నాయని నాగవంశీ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular