
న్యూస్ డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించారు. తాజాగా గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేయనున్నట్టు ప్రకటించారు.
ఈ నూతన పథకం 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. జూలై బిల్లుల నుంచే దీనిని వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. మొత్తం 1.67 కోట్లు కుటుంబాలకు ఈ ఉచిత విద్యుత్తు పథకం ప్రయోజనం కలిగించనుంది.
ఇంతేకాకుండా, గృహ వినియోగదారుల సమ్మతితో ఇంటి పైకప్పులపై లేదా సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర నిర్ణయం ప్రకటించారు. ఈ చర్యలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.
కుటిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు పూర్తిగా ఉచితంగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. మిగిలిన వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు.
పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీపై కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. TRE-4 పరీక్షను త్వరగా నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించినట్టు చెప్పారు. మహిళలకు 35% రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.