
నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరుచుకుంది. ఈ సినిమా హిట్ యూనివర్స్‌లో మూడో భాగంగా రూపొందింది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా మే 1న గ్రాండ్‌గా విడుదలకానుంది.
నాని సినిమాలకు యూఎస్ మార్కెట్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉండేదే. అయితే హిట్ 3 ఆ ట్రెండ్‌ను మించిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ ప్రీసేల్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే హాఫ్ మిలియన్ (500K) డాలర్ల మార్క్‌ను అందుకోబోతోందట.
ఇది నాని కెరీర్లో ఆల్‌టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ ప్రీసేల్స్ రికార్డ్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రేక్షకులు టీజర్, ట్రైలర్లకు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
అర్జున్ సర్కార్ పాత్రలో నాని శక్తివంతమైన ప్రదర్శన ఇవ్వనున్నాడని ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు. టెక్నికల్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హిట్ 3 మరో స్థాయిలో ఉండబోతుందని టాక్. ప్రస్తుతం యూఎస్ మార్కెట్లో నాని ప్రభంజనం కొనసాగుతుండగా, మొదటి రోజు కలెక్షన్లపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది.