Saturday, October 3, 2026
HomeSportsనా రిటైర్మెంట్ ఎప్పుడు అనేది నేనే నిర్ణయిస్తా: షమీ స్పష్టం

నా రిటైర్మెంట్ ఎప్పుడు అనేది నేనే నిర్ణయిస్తా: షమీ స్పష్టం

mohammed-shami-on-retirement-speculation-and-future-plans

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఘాటుగా స్పందించాడు. ఇంకా తనలో క్రికెట్ మిగిలి ఉందని, ఎవరూ తన భవిష్యత్తు నిర్ణయించలేరని స్పష్టం చేశాడు. ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ క్రికెట్‌లో రాణించి తిరిగి జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

“నా రిటైర్మెంట్‌తో ఎవరి జీవితం మారుతుంది? నేనెవరికీ అడ్డంకి కాదు. ఆటపై నాకు విసుగు పుట్టిన రోజు నేనే తప్పుకుంటాను. జట్టులోకి తీసుకోకపోయినా నేను ఆగను. అంతర్జాతీయ క్రికెట్ కాని దేశవాళీ అయినా ఆడుతూనే ఉంటాను” అని షమీ స్పష్టం చేశాడు.

లక్ష్యం 2027 ప్రపంచకప్ అని, ఆ కప్‌ను గెలిచి స్వదేశానికి తీసుకురావడమే తన కల అని తెలిపాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తనకు గాఢమైన బాధను మిగిల్చిందని గుర్తుచేశాడు. “ఫైనల్‌కు చేరాం కానీ చివర్లో విఫలమయ్యాం. అభిమానుల మద్దతు మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది” అని అన్నాడు.

గత రెండు నెలలుగా ఫిట్‌నెస్‌పై తీవ్రంగా కృషి చేస్తున్నానని షమీ చెప్పాడు. బరువు తగ్గించుకోవడం, బౌలింగ్‌లో లోడ్ పెంచడం వంటి అంశాల్లో దృష్టి పెట్టానని, ఇప్పుడు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలనని ధైర్యంగా తెలిపాడు. గతంలో గాయాల కారణంగా వచ్చిన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు చిన్న అసౌకర్యం కలగడంతో తానే తప్పుకున్నానని వివరించిన షమీ, తన ఆటపై ఉన్న ఆసక్తి ఇంకా తగ్గలేదని చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ గురించి అనవసర ఊహాగానాలు ఆపాలని స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular