
న్యూస్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో అందరి దృష్టి వారి మధ్యన అలంకరించిన ఓ మొక్కపైనే పడింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా, ఈ మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
పుతిన్ మోదీ ఆసీనులైన సీట్ల మధ్యన మిలమిల మెరిసిపోతున్న ఈ మొక్క పేరు హెలికోనియా. ఇది ఇరు దేశాల మధ్య శాంతి సౌహార్ద్రాలు నెలకొనడానికి చాలా దోహదపడుతుందట.
హెలికోనియా మొక్క ఎక్కడుంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇది సానుకూల పవనాలను సృష్టిస్తుంది. ఈ మొక్క ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అభివృద్ధి ఎదుగుదల ఉంటుందని నమ్ముతారు.
పుతిన్ మోదీ కలుసుకున్న ఆ గదిలో కనిపించే ఏ వస్తువు కూడా యాదృచ్చికంగా పెట్టినది కాదు. అక్కడి మొక్కలు, పూలు, రంగు, ఆసనాల స్థానాలు అన్నీ ఆ సందర్భానికి అనువుగా ఉండేలా ఇంటీరియర్ డెకరేటర్ చూసుకున్నారు.
ఈ అలంకరణలో హెలికోనియా మొక్క సముచిత స్థానం సాధించుకుంది. రష్యా భారత్ సమావేశం సానుకూలంగా ఉండబోతోందని, ఇరు దేశాల భాగస్వామ్యం ప్రగతి పథాన దూసుకెళుతుందని ఇది సింబాలిక్‌గా తెలుపుతోంది.
