
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ బజ్ ఉంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా కనిపించనున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
ఇటీవల ప్రమోషన్లలో భాగంగా ఒక విలేకరి తేజను ప్రశ్నించారు. మిరాయ్ టీజర్‌లో కనిపించిన శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారా అని అడిగాడు.
దీనికి తేజ సజ్జా స్పష్టంగా సమాధానం ఇస్తూ, “మహేష్ బాబు గారు ఇందులో నటించలేదు. కానీ శ్రీరాముడి పాత్ర ఎవరూ చేశారు అనేది మేము ఇప్పుడే చెప్పలేం” అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో సినిమా చుట్టూ మరింత మిస్టరీ పెరిగింది. అసలు శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు మాత్రం మహేష్ బాబు కెమియో ఇచ్చారేమో అని ఇంకా ఆశ పెంచుకుంటున్నారు.
ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించనుంది. భారీ విజువల్స్, సరికొత్త కాన్సెప్ట్‌తో మిరాయ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.