Sunday, July 12, 2026
HomeNationalలక్కీ డ్రాలో ఫార్చ్యూనర్: అదృష్టం అంటే ఈ బాలుడిదే!

లక్కీ డ్రాలో ఫార్చ్యూనర్: అదృష్టం అంటే ఈ బాలుడిదే!

medhansh-wins-toyota-fortuner-lucky-draw-3102bc

న్యూస్ డెస్క్: అదృష్టం ఎప్పుడూ పెద్దలకే దక్కాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి నిరూపించాడు. కేవలం రూ. 201 తో కొనుగోలు చేసిన ఒక లక్కీ డ్రా కూపన్ ద్వారా, ఆ చిన్నారి ఏకంగా రూ. 53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకోవడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య ఘటనతో ఆ చిన్నారిని అందరూ ‘లక్కీ బాయ్’ అని పిలుస్తున్నారు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హన్‌పూర్ జిల్లా, శిలాంపుర ప్రాంతంలో చోటుచేసుకుంది. దసరా వేడుకల సందర్భంగా అక్కడి అభాపురి ప్రాంతంలో ఉన్న సర్కార్ ధామ్ నిర్వహించిన గర్భ ఉత్సవాల్లో ఈ లక్కీ డ్రా స్కీమ్‌ను పెట్టారు. స్థానిక అధికారుల అనుమతితో, పన్ను చెల్లింపుల నియమాలను పాటిస్తూ ఈ డ్రా నిర్వహించబడింది.

శిలాంపూర్ నివాసి కిరణ్ రాయిక్వార్ తన మనవడు మేధాన్ష్ పేరు మీద రూ. 201 చెల్లించి ఈ కూపన్‌ను కొనుగోలు చేశారు. మరుసటి రోజు డ్రా తీయగా, చిన్నారి మేధాన్ష్ పేరున్న కూపన్ విజేతగా ప్రకటించబడింది. రూ. 53 లక్షల ఎస్‌యూవీని గెలుచుకోవడం ఆ కుటుంబానికి షాక్‌తో పాటు అపారమైన సంతోషాన్ని ఇచ్చింది.

బొమ్మ కార్లంటే మేధాన్ష్‌కు చాలా ఇష్టమని, ఇప్పుడు అతనికి నిజమైన పెద్ద కారు దక్కడం తమకు దేవుడి వరంగా భావిస్తున్నామని అతని నాయనమ్మ కిరణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మేధాన్ష్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular