
పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ మూవీపై ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది. ఇప్పటికే ఫ్యాన్స్ ఆశల్ని పెంచుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
తాజాగా దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాలపై ఓ గ్రాండ్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. భారీ సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పాట యాక్షన్ మూడ్‌కి మాస్ వైబ్‌కి మిక్స్ అయిన స్టైల్‌లో ఉండనుందని టాక్.
ఈ పాట షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిత్రబృందం కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనుందని సమాచారం. టాకీ పార్ట్ మొదలు పెట్టే ముందు యూనిట్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇక ఈ బ్రేక్ టైమ్‌లో మహేష్ తన ఫ్యామిలీతో ఓ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
మొత్తానికి, మహేష్ బాబు – రాజమౌళి లైఫ్‌టైమ్ ప్రాజెక్ట్ ఎలాంటి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతోందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
mahesh babu, ss rajamouli, pan world movie, priyanka chopra, grand song shoot,