
న్యూస్ డెస్క్: నారా లోకేష్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులు ఆయనను ఎగతాళి చేసినా, ఇప్పుడు పార్టీ కేడర్ లో ఆయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. తండ్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో లోకేష్ తన పాత్రను స్పష్టంగా చూపిస్తున్నారు.
లోకేష్ మొదట పార్టీ కార్యకర్తలతో దగ్గరగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించారు. బీమా సదుపాయాల నుండి వ్యక్తిగతంగా భరోసా ఇచ్చే వరకు ఆయన తీసుకున్న చర్యలు కేడర్ లో విశ్వాసం పెంచాయి. దీంతో ఆయన పార్టీకి అనుసంధానమైన నేతగా నిలిచారు.
మంత్రివర్గంలో కూడా లోకేష్ తన ప్రాధాన్యతను చూపుతున్నారు. సహమంత్రులతో సమావేశాలు, ఎంపీలతో చర్చలు నిర్వహించడం ద్వారా ఆయన ప్రభుత్వంలోనూ, ఢిల్లీలోనూ ప్రభావం పెంచుకుంటున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన తీరు దీనికి ఉదాహరణ.
అదే సమయంలో లోకేష్ బీజేపీ టాప్ లీడర్లతో కూడా టచ్ లో ఉన్నారు. మోడీ, అమిత్ షా వంటి నేతలతో భేటీలు జరుపుతూ ఏపీ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తున్నారు. జాతీయ మీడియా ఇంటర్వ్యూలలో ఆయన జవాబులు భవిష్యత్ నాయకుడిని గుర్తు చేస్తున్నాయి.
ఇక బాబు వ్యూహం ప్రకారం ఎక్కువ బాధ్యతలు లోకేష్ పై పడుతున్నాయి. ప్రభుత్వ పనుల్లోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ ఆయననే ముందుకు నెట్టడం చంద్రబాబు చేస్తున్న స్పష్టమైన ప్రణాళిక అని తెలుస్తోంది. లోకేష్ కూడా ఆ అంచనాలను అందుకుంటున్నారు.
2029 ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అవుతారన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో ఆయన మరింత రాటుదేలి, “వెయిటింగ్ సీఎంగా” సిద్ధం అవుతారని అంటున్నారు.